జామ చెట్టు పొదలకు అనుకూల వాతావరణ పరిస్తితులు కల్పిస్తే సంవత్సరం పొడుగునా పూత పూస్తాయి & కాత కాస్తాయి
మెగ్నీషియం సల్ఫేట్ స్ప్రే చేస్తే, అన్ని మొక్కలకు/చెట్లకు విపరీత పూత పిందె కాత వస్తుంది. అత్యధికంగా ఆడపూత వస్తుంది
జామకు జింక్ మెగ్నీషియం 2గ్రా/లీ & నీరు 7రోజుల వ్యవధిలో రెండుసార్లు స్ప్రే చేస్తే ఆకు ఆకుకు పూత వస్తుంది. పూవులన్నీ పిందెలు గా మారుతాయి. ఎంతెండకు కూడా ఒక్క పిందే రాలదు
జామకు జింక్ స్ప్రే చేసినా భూమిలో వేసినా కాయలు చాలా వగరుగా గట్టిగా మారుతాయి. దానిని అధిగమించడానికి నేల లోపట దుక్కికి ఫాస్ఫేట్/భాస్వరం పుష్కలంగా వేయాలి. లేదా 19-19-19 రెండు మూడు సార్లు స్ప్రే చేయాలి
జామకు తెల్లదోమ TEA BUG or WHITE MOSQUITO BUG చాలానష్టంచేస్తుంది. దాని నివారణకు దుక్కికి సిలికాన్ పుష్కలంగా వేసుకోవాలి. దుక్కి బాగా ఎండనివ్వాలి
పంటదశలో TEA BUG లేనప్పుడు ఏప్రిల్ మే నెలల్లో జింక్ మెగ్నీషియం పిచికారి చేయాలి లేదా ఆవు మూత్రం & వేపాకు కాషాయం పిచికారి చేస్తే వెంబడే చనిపోతుంది. జింక్+మెగ్నీషియం or 19-19-19 క్రమానుసారంగా స్ప్రే చేయాలి
జామకైనా ఏ పంటకైనా ఆరుతడి పాటించాలి. జామకు ఆకులు పూర్తిగా వాడిన తరువాత బొదెకట్టి వారం పది రోజులకొకసారి నిండా నీరు పెట్టితే విపరీతంగా పూత కాతా వస్తుంది. కాయలు చెక్కరకేళీలలాగుంటాయీ. గింజలు చిన్నగా గసగస్సాలంత మెత్తగా వుంటాయి
- G Sudarshan Reddy